Saturday, April 27, 2024
- Advertisement -

నారప్ప ఓటీటీలో విడుదల చేయడం బాధగానే ఉంది..!

- Advertisement -

వెంకటేశ్​, ప్రియమణి జంటగా.. శ్రీకాంత్​ అడ్డాల తెరకెక్కించిన నారప్ప చిత్రం ఈ నెల 20 (మంగళవారం) అమెజాన్​ ప్రైమ్​లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఓ అగ్రహీరో నటించిన చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుండటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక వెంకటేశ్​ ఫ్యాన్స్​ తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరోవైపు నిర్మాత సురేశ్​ బాబు నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వెంకటేశ్​ తన అభిమానులకు సారీ కూడా చెప్పాడు.

కాగా తాజాగా ఈ విషయంపై సురేశ్​ బాబు స్పందించారు. నారప్ప చిత్రం ఓటీటీలో విడుదల కావడం నాకు కూడా ఎంతో బాధగానే ఉంది. ఎందుకంటే నాకు కూడా థియేటర్లు ఉన్నాయి. థియేటర్ల యజమానులు ఎంత నష్టపోతారో తెలుసు. అయితే ఈ సినిమాలో నాతోపాటు మరో నిర్మాత కళైపులి ఎస్​ థాను మెజార్టీ భాగస్వాముడిగా ఉన్నారు. ఆయన నిర్ణయం మేరకే సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇక దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలయ్యే చాన్స్​ ఉంది. ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. మలయాళంలో దృశ్యం2 కూడా ఓటీటీలో రిలీజ్​ అయ్యింది.

Also Read: అన్నా మీ నంబర్​ ఇవ్వండి.. తేజ్​ ఫన్నీ ఆన్సర్​..!

ఇక విరాట పర్వం గురించి ఇప్పుడే ఏ విషయం చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్​ ఇంకా పూర్తికాలేదు. తెలంగాణలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యే చాన్స్​ ఉంది’ అని సురేశ్​ బాబు పేర్కొన్నాడు. మొత్తానికి నారప్ప ఓటీటీలో విడుదల చేయడం.. తీవ్ర వివాదాస్పదం అయింది. దీంతో సురేశ్​ బాబు ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -