Friday, April 19, 2024
- Advertisement -

‘NGK’ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ లలో సూర్య కూడా ఒకరు. గతేడాది ‘గ్యాంగ్’ అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన సూర్య ఈసారి ‘ఎన్జీకే’ అనే పొలిటికల్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఇవాళ అనగా మే 31న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా.

కథ:
నంద గోపాల కృష్ణ (సూర్య) గొప్పగా చదుకున్న ఒక మేధావి. తనకి ఎంతో డబ్బు తెచ్చిపెడుతున్న ఉద్యోగాన్ని వదిలేసి తన వూర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనీ డిసైడ్ అవుతాడు. ఈ దశ లో మెల్లగా కాస్త సమాజ సేవ కూడా చేస్తూ ఉండగా ఒకానొక టైం లో తాను రాజకీయాల్లో కి వెళితే ఇంకా ఎక్కువ సేవ చేయచ్చు అనే ఆలోచన వస్తుంది. అనుకుందే తడవుగా రాజకేయాల్లో చేరిన నంద గోపాల కృష్ణ క్రమక్రమం గా ముఖ్య మంత్రి అవుతాడు. అసలు అంత తక్కువ సమయం లో ఎలా ముఖ్య మంత్రి అయ్యాడు? తాను రాజకీయాల్లోకి రావడానికి కారణమేమిటి? ఆ తర్వాత అతను ఏం చేసాడు? అనేది మిగిలిన కథ.

నటీనటులు:
టైటిల్కు తగ్గట్టు గానే ఈ సినిమా మొత్తం సూర్య పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు సూర్య. ఒక పొలిటీషియన్ పాత్రలో సూర్య నటన ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేస్తుంది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు సాయి పల్లవి మరియు రకుల్ ప్రీత్ వారి పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అంతేకాక వారి అందం అభినయం తోనే కాక నటనతో కూడా ఆకట్టుకున్న ఈ భామలిద్దరూ హీరో సూర్యతో కూడా మంచి కెమిస్ట్రీ కూడా పండించారు. దేవరాజ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ గా మారింది. పొన్నవన్ నటన బాగుంది. బాలా సింగ్ చాలా సహజంగా నటించారు. ఉమా పద్మనాభన్ చాలా బాగా తన పాత్ర ను పండించారు. వేల రామమూర్తి, తలైవసాల్ విజయ్ మరియు ఇలవరసు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు అందించిన నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు క్వాలిటీ పరంగా ఎలాంటి రాజీ పడలేదని తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. కేవలం పాటలు మాత్రమే కాకుండా యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం కూడా కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. శివకుమార్ విజయన్ అందించిన కెమెరా విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

తీర్పు:
దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా ని అంతే అద్భుతంగా తెరకెక్కించడం లో దర్శకుడు విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులను ఒకే లాంటి నేరేషన్ తో నిరుత్సాహపరిచారు దర్శకులు. ‘ఎన్జీకే’ సినిమా లో అలరించే కథ లేదు కానీ పాయింట్ మట్టుకు బాగుంది. ఇలాంటి కథ కి కాస్త సీరియస్ నేరేషన్ అవసరం కానీ దర్శక నిర్మాతలు మాత్రం కాస్త ఎంటర్టైనింగ్ ఎలిమెంట్లు కూడా జోడించడం తో సినిమా అంత ఆసక్తికరం గా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో అందరు నటీనటులు అద్భుతమైన నటనను కనబరిచారు. దర్శకుడు ఈ సినిమాకి అందించిన రియలిస్టిక్ అప్రోచ్ ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది కానీ ఎమోషన్ మాత్రం జనాలని టచ్ చేసే లేకపోవడం కాస్త నిరుత్సాహ పరిచే అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే తమిళ నేటివిటి తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. ఇక ఈ సినిమాలో ఉన్న వయోలెన్స్ కూడా అందరినీ మెప్పించే లేకపోవచ్చు. ఓవరాల్ గా ‘ఎన్జీకే’ సినిమా లో సూర్య తప్ప మెప్పించగల అంశాలు ఏమి లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -