సిరివెన్నెలకు ప్రముఖుల ఘన నివాళి

- Advertisement -

సినీ ప్రపంచం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. తన అక్షరాలతో శ్రోతల మనస్సుల్లో వెన్నెల కురిపించిన సీతారామశాస్త్రి కన్నుమూశారు. నేడు మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల కడసారి చూపుకోసం ఆయన భౌతికదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఆయనను దర్శింకునేందుకు సినీ ప్రపంచం, అభిమానులు తరలివస్తున్నారు. సినీ ప్రముఖులంతా సిరివెన్నెలకు నివాళులర్పిస్తున్నారు.

సీతారామశాస్త్రిని చూసి సినీ నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. తను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానన్నారు. సిరివెన్నెల పార్ధీవ దేహాన్ని దర్శించిన హీరో వెంకటేశ్ తెలుగు సినీ పరిశ్రమ మహా కవిని కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్, అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకధీరుడు రాజమౌళి, సంగీత ధర్శకుడు కీరవాణి, దర్శకుడు గుణశేఖర్, నటుడు రావురమేశ్, నిర్మాత స్రవంతి రవికిషోర్, ఎమ్మెల్యే దానం నాగేంధర్, ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించారు. వారితో పాటు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, గాయని సునీత, రచయిత పరుచూరి గోపాల కృష్ణ….. సీతారామశాస్త్రిని దర్శించుకున్నారు. ఇండస్ట్రీ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని జీవిత రాజశేఖర్.. ఆవేదన వ్యక్తం చేశారు.

సిరివెన్నెల పాట.. నందుల పూదోట

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -