‘వకీల్ సాబ్’ లో హైలెట్ సీన్లు..

- Advertisement -

పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్‌సాబ్‌` వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత చేసిన సినిమా ఇదే. అందుకే అభిమానుల్లో జోష్ పెరిగింది. పవన్ కల్యాణ్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్లో రూపొందిన ‘వకీల్ సాబ్’ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ‘దిల్’రాజు నిర్మించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. లాయర్ వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు.

ప్రత్యేకించి కోర్టు సన్నివేశాల్లో ప్రధానమైన తనదైన మార్క్ చాటుకున్నారు. ఈ సినిమా చూసిన పవన్ ఫ్యాన్స్ ఇందులో కొన్ని హైలైట్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ మూవీ మొదలైన తర్వాత పావుగంట తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆయన ఎంట్రీని డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉందని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీలో కూడా పవన్ కొత్తగా కనిపించాడు.  శృతిహాసన్ చనిపోయిన సీన్ లో అలాగే కోర్టులో ఎమోషనల్ గా సాగే కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

- Advertisement -

సెకాండాఫ్ లో వచ్చే కోర్టు సీన్లో పవన్ – ప్రకాశ్ రాజ్ మధ్య వాదోపవాదాలు నడిచే సీన్ క్లాప్స్ కొట్టిస్తుందని అంటున్నారు. ఇక బాధిత యువ‌తులుగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య తమ పాత్రల్లో అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా నివేదా నటన చాలా బాగుంది. ఇక మెట్రో ట్రైన్ లోని ఫైట్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. క్రిమిన‌ల్ లాయ‌ర్ గా ప్ర‌కాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రలో చెల‌రేగిపోయారు. గెస్ట్ రోల్ లాంటి హీరోయిన్ పాత్రలో శృతిహాస‌న్ ఆక‌ట్టుకుంది.

రెండో శతాబ్దం నాటి గణేశుని విగ్రహం

గురువులకు గౌరవం.. సాయం ఎప్పుడంటే..!

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -