Monday, May 6, 2024
- Advertisement -

‘అంత‌రిక్షం’ మూవీ రివ్యూ

- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నాడు. రెండు వ‌రుస హిట్లు సాధించాడు వ‌రుణ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ సినిమా హిట్లతో లైన్లోకి వ‌చ్చాడు. తాజాగా వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌,ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో అంద‌రికి ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. పైగా ఈ సినిమాకు ‘ఘాజీ’ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి. మ‌రి ఈ రోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌యత్నం చేద్దాం.

క‌థ‌:
స్పేస్ సెంటర్ లో ఉన్న సైంటిస్ట్ లకు ఓ విషయం కంగారుపెడుతుంది. అదేమిటంటే…తాము ప్రవేశపెట్టిన శాటిలైట్ మిహిర దారి తప్పిందని… కక్ష్య వదిలిందని..దాంతో ప్రపంచంలో ఉన్న కమ్యునికేషన్ వ్యవస్దకు పెద్ద విఘాతం కలగబోతోందని తెలుస్తుంది. దాంతో దాన్ని స్పేస్ లోకి వెళ్లి కోడింగ్ సరిచేసి సెటిరైట్ చేసేదెవరు అని ఆలోచిస్తే..వాళ్లకు తట్టిన ఒకే ఒక పేరు దేవ్ (వరుణ్ తేజ). దేవ్ తమ ఆఫీస్ లో ఉంటే వెంటనే పిలిచి ఆ పని అప్పచెప్పేవారు. కానీ అతను 5 ఏళ్ల క్రితమే పర్శనల్ కారణాలతో జాబ్ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో.. తెలియాలి….ఈ పని చేయటానికి ఒప్పుకోవాలి. అందుకోసం మరో వ్యామోగామి రియా (ఆదిత్యా రావు హైదరీ) రంగంలో కి దిగుతుంది. అతన్ని పట్టుకుని ఒప్పిస్తుంది. అక్కడ నుంచి దేవ్ ..స్పేస్ లోకి వెళ్లి మిహరను ఎలా సెట్ చేసాడు. ఆ ప్రాసెస్ లో అతనికే ఏ సమస్యలు ఎదురయ్యాయి…అసలు అతను ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి…శాటిలైట్ ని సెట్ చేసాక..అతను ఏం చేసాడు..వెనక్కి వచ్చాడా ..లేక అతని మనస్సులో వేరే ఆలోచన ఉందా, సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏమిటో తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.

న‌టీ,న‌టుల ఫ‌ర్మామెన్స్‌:
అద్బుతంగా ఫెరఫార్మెన్స్ చేసాడని చెప్పలేం కానీ ..ఇలాంటి సబ్జెక్టు ఎంచుకునే అతను సగం మార్కులు వేయించుకున్నారు. మిగతా సగం…సినిమాలో అతి చెయ్యని నటనతో నిలబెట్టాడు. హీరోయిన్స్ పాత్రలు డిజైనింగ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అనిపించింది. అప్పటికీ ఆదిత్యారావు హైదరీ… తన స్క్రీన్ ప్రెజన్స్ తో హైలెట్ అయ్యింది. లావణ్య ది చాలా చిన్న పాత్ర. ఇంకా సినిమాలో చెప్పుకోద‌గిన పాత్ర‌లు ఏమి లేవు

విశ్లేష‌ణ‌:
ఘాజీ సినిమాతో ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్న సంక‌ల్ప్ రెడ్డి.మ‌రోసారి గ్రిప్పింగ్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే సినిమా క‌థ‌ను బలంగా రాసుకున్న సంక‌ల్ప్‌ రెడ్డి. దానిని తెర మీద చూపించ‌డంలో మాత్రం కాస్తా త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి. ఆ మిషన్ పూర్తైపోవటంతోనే పూర్తవ్వాలి. కానీ ఆ మిషన్ పూర్తైన తర్వాత…కథని ఫినిష్ చేయకుండా… అక్కడ నుంచి హీరో కు మరో లక్ష్యం ఉన్నట్లు ..దానికోసం అతను ప్రయత్నం మొదలెట్టినట్లు కథను ఎక్సటెండ్ చేసారు. దాంతో అక్కడిదాకా టెంపోతో ఉన్న కథ ఒక్కసారిగా డ్రాప్ అవటం స్టార్ట్ అయ్యింది. రెండో కథ కనెక్ట్ కాలేదు. అప్పటికీ ఆ రెండో కథకు సంభందించిన విషయాలు ఫస్టాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో కలిపారు కానీ..ఫలితం లేకుండా పోయింది.

సాంకేతిక ప‌రిజ్ఞానం:
వాస్తవానికి ఇలాంటి సినిమాలకు విఎఫ్ ఎక్స్ విభాగం మంచి అవుట్ ఫుట్ ఇవ్వాలి. కానీ బడ్జెట్ కంట్రోల్ పెట్టారో లేక సరైన విఎఫ్ ఎక్స్ టెక్నీషియన్స్ దొరకలేదో కానీ ..పూర్ గా ఉంది. మిగతా విభాగాలు సినిమాలో కంటెంట్ ని రిచ్ గా ఎలివేట్ చేయటంలో సాయం చేసాయి. అయితే సెకండాఫ్ లో బోర్ కొట్టే సన్నివేశాలను గమనించి ఎడిట్ చేస్తే మరింతగా సినిమా నచ్చేది.

బోట‌మ్ లైన్:
అన్ని సినిమాలు ‘ఘాజీ’లు కాలేవు బ్ర‌ద‌ర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -