Saturday, April 27, 2024
- Advertisement -

విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం

- Advertisement -

విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ఆమె నటించి తొలిసారి నిర్మించిన ‘నట్‌కట్’సినిమాకి చోటు దక్కింది. లింగ బేదం, సమానత్వం, మహిళలపై చిన్న చూపు అంశాలతో రూపొందిన షార్ట్‌ ఫిలిం నట్‌కట్‌. 2021 ఏడాదికిగానూ బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం క్యాటగిరి ఆస్కార్ అవార్డ్‌రేసులో నిలిచింది. ఈ సినిమాలో విద్యాబాలన్‌ తల్లిపాత్రలో నటించారు.

‘నట్‌కట్’అంటే అల్లరి చేసే వాళ్లను నట్‌కట్ అని పిలుస్తుంటారు. ఒక అల్లరి పిల్లాడు, ఓ తల్లి కథే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా తాజాగా 2021 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్ రేసులో నిలవడంపై నిర్మాణ సంస్థ ఆర్‌ఎస్‌వీపీ, విద్యాబాలన్ సంతోషం వ్యక్తం చేసారు. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ కావడంపై ప్రియాంక చోప్రా సహా పలువురు విద్యాబాలన్‌కు కంగ్రాట్స్ తెలిపారు. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కెటగిరిలీలో తప్పుకుండా ఆస్కార్ అవార్డు సాధిస్తుందని ఆషాభావం వ్యక్తం చేసారు.

విద్యా బాలన్ విషయానికొస్తే.. భారత దేశం గర్వించదగ్గ అద్భుత నటీమణుల్లో ఆమె ఒకరు. అతిసులువుగా ముఖంలో పలు భావాలు పలికించగల నేర్పు విద్యాబాలన్ సొంతం. దక్షిణాది బీజాలు ఉన్న విద్యాబాలన్, ఉత్తరాదిని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీమతి బసవరామతారకం పాత్రను ఆమె పోషించి, తెలుగువారికీ దగ్గరయ్యారు. గతేడాది ఈ భామ ‘శకుంతల దేవి’బయోపిక్‌లో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి పాత్రలో ఒదిగిపోయింది. అంతకు ముందు మన తెలుగు నృత్యతార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’లో నటించీ జనాన్ని మెప్పించారు. ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు.

హీరోయిన్ సంగీత భర్త గురించి తెలుసా ?

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

50 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -