Tuesday, May 7, 2024
- Advertisement -

కరోనా కట్టడి మద్య ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం!

- Advertisement -

గత ఏడాది నుంచి కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంటర్ టైన్ మెంట్ పూర్తిగా ముతపడింది. ఈ మద్యనే తిరిగి థియేటర్లు, మాల్స్ ఓపెన్ చేయడంతో మళ్లీ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్న తరుణంలోనే మళ్లీ సెకండ్ వేవ్ కష్టాలు మొదలయ్యాయి. దాంతో మళ్లీ ఎంటర్ టైన్ మెంట్ కి కష్టాలు వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ప్రతిష్ఠాత్మక 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ప్రారంభమైంది.

కోవిడ్‌ కారణంగా రెండు ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అటు డోల్బీ థియేటర్‌లో, మరోవైపు లాస్‌ఏంజెల్స్‌లో అవార్డు విజేతలను ప్రకటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలను మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ‘నో మ్యాడ్‌లాండ్’ చిత్రానికి గాను క్లోవీ చావ్ ఉత్తమ దర్శకురాలుగా ఎంపికైంది.

చోలే జావోకు బెస్ట్‌ డైరెక్టర్ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌కు ఆస్కార్‌ దక్కింది. సౌండ్ ఆఫ్ మెటల్ కు ఉత్తమ సంగీతం, ‘జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా’ ఫేమ్ డానియెల్ కలువోయా ఉత్తమ సహాయనటుడిగా ఎంపికయ్యారు.

బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: మన్నారి

ఉత్తమ చిత్రం ఎడిటింగ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్‌ (నోమ్యాడ్‌ లాండ్‌)

ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మిస్సయా)

ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జంగ్‌ (మినారి)

ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్‌ (మ్యాంక్‌)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -