ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర విషాదం!

- Advertisement -

పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్య ఇప్పుడు ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప్రేమజంట సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగలోకి దిగి తోటపల్లి బ్యారేజ్ వద్ద వెతికారు.. కానీ ఫలితం లభించలేదు.

రెండ్రోజులుగా గత ఈతగాళ్ల సాయంతో నాగావళి నదిలో వెతికించగా బుధవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు పైకి తేలాయి. దీంతో పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను బొబ్బిలికి చెందిన రాకేష్‌, కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. కొంత కాలంగా ఈ జంట ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో వ్యతిరేకించారు.

- Advertisement -

అయితే పెద్దలను ఎదరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్చయించుకున్నారు. రెండ్రోజుల క్రితం స్కూటీపై బ్యారేజీ వద్దకు వచ్చిన ఈ జంట అక్కడే కాసేపు తిరిగి ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని తమ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. తమ చావుకు తన బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్‌ స్టేటస్ పెట్టింది. తమ బిడ్డల మృతితో రెండు కుటుంబాల వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

చిన్నోడు, పెద్దోడు.. వీళ్ల అసలు పేర్లు ఇవే..!

నారప్ప సెన్సార్​ పూర్తి.. విడుదల ఎప్పుడో?

సెట్స్ పైకి శాకుంతలం..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -