Saturday, April 27, 2024
- Advertisement -

హైవే హత్యల కేసులో 12 మందికి ఉరిశిక్ష‌.. ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు..

- Advertisement -

ఒంగోలు కుటుంబ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. హైవే కిల్లర్ మున్నా కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్షను విధించింది. ప్రకాశం జిల్లాలో కొన్నేళ్ల కిందట హైవేపై జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. మున్నా అనే వ్యక్తి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని లారీ డ్రైవర్లు, క్లీనర్లే లక్ష్యంగా సీరియల్ హత్యల పరంపర కొనసాగించాడు. మొత్తం 7 ఘటనల్లో 13 మంది హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు పాల్పడింది మున్నా అతడి గ్యాంగ్ అని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు ముందుకు తీసుకువచ్చారు.

గత 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో సచలనంగా మారింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు హైజాక్ చేసేవారు. ఐరన్ లోడు అమ్మేశాక, లారీలను తుక్కు కింద విడగొట్టి ఆ భాగాలను కూడా విక్రయించేవారు. గత 2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. అయితే వీరు దాడి చేసే విధానం పక్కా ప్లాన్ ప్రకారం జరిగేది. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా లారీలను ఆపేవారు.

మున్నా అధికారి వేషంలో ఉండగా, అతడి పక్కన ఓ వ్యక్తి గన్ మన్ గా మెషీన్ గన్ ఉండేవాడు. దాంతో నిజమైన అధికారులే అనుకొని లారీ డ్రైవర్లు బండ్లను ఆపేవారు.. చెక్ చేయాలనే నెపంతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల గొంతుకలకు తాడు బిగించి దారుణంగా హత్య చేసేవారు. తాము చంపిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి హైవే పక్కనే వాగుల్లో పూడ్చిపెట్టేవారు. తమిళనాడుకు చెందిన ఒక లారీ యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మున్నా గ్యాంగ్ ఆటకట్టించారు.

నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈనెల 18న వెల్లడించారు. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు, ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి.. ?

భర్త చెంప చెళ్లుమనిపించిన నటి.. వైరల్ వీడియో!

ఉత్కంఠ రేపుతున్న ‘క‌ప‌ట‌నాట‌క సూత్ర‌ధారి’ట్రైల‌ర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -