Wednesday, May 8, 2024
- Advertisement -

హైద‌రాబాద్ జంట‌బాంబుపేళుల్ల‌కేసులో సంచ‌ల‌న తీర్పు..

- Advertisement -

2007 ఆగస్ట్ 25వ తేదీన గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సోమవారం ఎన్ఐఏ ప్ర‌త్యోక కోర్టు సంల‌చ‌న తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ఏ1, ఏ2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీద్ సయ్యద్‌లను న్యాయస్థానం నేరస్తులుగా తేల్చింది. ఇందులో మొదటి ఇద్దరు నేరస్తులకు ఉరిశిక్ష విధించింది. మూడో నేరస్తుడు తారిఖ్ అంజుమ్‌కు యావజ్జీవ శిక్ష విధించింది.

ఈ కేసులో ఆధారాలు లేవంటూ మరో ఇద్దరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. నాంపల్లి అదనపు సెషన్స్ జడ్జి చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో .. నాంపల్లి అదనపు మెట్రో సెషన్స్ జడ్జి ఈ తీర్పును సోమవారం నాడు వెల్లడించారు.

2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్‌లో , ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 44మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా ఎన్ఐఏ నిర్దారించింది.

ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ను పోలీసులు 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్ పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ 1125 పేజీల చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇద్దరు రియాజ్ భత్కల్ తో పాటు యాసిన్ భత్కల్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -