Tuesday, May 7, 2024
- Advertisement -

కుల‌భూష‌న్ మ‌ర‌ణ శిక్ష‌పై స్టే….

- Advertisement -
International Court of Justice stays Kulbhushan Jadhav’s death sentence awarded by Pakistan

గూఢ‌చ‌ర్యం కేసులో నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాక్ విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌ను వ్య‌తిరేకిస్తున్న భార‌త్ కృషి కాస్త ప‌లించింది. పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్) స్టే విధించింది. దీంతో కులభూషణ్ జాదవ్ కు తాత్కాలికంగా ఉరి తప్పింది.

జాద‌వ్‌కు విధించిన మ‌ర‌ణ శ‌క్ష‌పై భార‌త్ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో స‌వాల్ చేసింది.నేవీ అధికారిగా పదవీ విరమణ పొందాలక ఇరాన్ లో కులభూషణ్ వ్యాపారం చేశారని కోర్టుకు భారత్ తెలిపింది. గూఢచర్య ఆరోపణలు చేసి అతనికి పాక్ మిలటరీ కోర్టు అన్యాయంగా మరణ శిక్ష విధించిందని చెప్పింది. భారత్ వాదనను విన్న న్యాయస్థానం పాక్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
గతేడాది మార్చిలో బలూచిస్థాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతుండగా తాము పట్టుకున్నట్టు పాక్ ఆర్మీ గతంలో ప్రకటించింది. స‌రిగా విచారించ‌కుండానే ఆగమేఘాల మీద మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ మేరకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా సంతకంతో ఒక ఉత్తర్వు కూడా విడుదలయ్యింది.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే కులభూషన్ పాక్ ఆర్మీకి దొరకలేదని ఇరాన్ లో తాలిబన్లు కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీకి అమ్మేశారని కూడా మరో కథనం వెలుగులోకి వచ్చింది. దీనిపై భార‌త్ చేసిన విజ్ణ‌ప్తుల‌ను పాక్ ప‌ట్టించుకో్లేదు. ఉరిశిక్ష‌ను అమ‌లు చేస్తామ‌ని పాక్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిదే.
అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై భారత విదేశాంగా శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఆ తీర్పు గురించి తాను కుల‌భూష‌న్ త‌ల్లిదండ్రుల‌కు తెల‌పిన‌ట్లు ట్వీటు చేశారు సుష్మా.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -