ప‌వ‌న్ క‌ళ్యాన్ పై బంజారా హిల్ష్ పోలీస్ స్టేష‌ణ్‌లో ప‌లు సెక్స‌న్ల కింద‌కేసు న‌మోదు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప‌లు సెక్స‌న్ల కింద కేసు నమోదైంది. ప్రముఖ ఛానల్ Tv9పై ట్విట్టర్ ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ.. ఛానల్ క్రెడిబిలిటీని దెబ్బతీసినందుకు గాను పవన్ కళ్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 469, 504, 506 సెక్షన్ల క్రింద బుధవారం నాడు కేసు నమోదైంది.

టివి9 అధినేత శ్రీనిరాజుపై తీవ్రమైన పదజాలంతో పవన్ విరుచుకుపడ్డారు. శ్రీరెడ్డి వీడియోను మీ అమ్మకు, మీ బిడ్డకు, మీ భార్యకు చూపించాలంటూ కూడా ఘాటుగా పవన్ రియాక్ట్ అయ్యారు. సంపద అంతా ఎలా పోగు చేసుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. శ్రీనిరాజు ఆస్తులపై పవన్ చాలా ఆరోపణలు చేశారు.అంతేకాదు టివి9 సిఇఓ రవి ప్రకాష్ మీద కూడా నిప్పులు చెరిగారు. రవి ప్రకాష్ ఒక వ్యక్తితో ఎందుకు కాళ్లు మొక్కించుకున్నారో చెప్పగలరా అని పాత వీడియోను ఒకదాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

టీవీ 9, ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్‌ను నిషేదించాలని కోరుతూ పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మీడియా కధనాలను వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో వ్యాఖ్యలు, ఆరోపణల పట్ల కొన్ని పాత్రికేయ సంఘాలు అభ్యతరం తెలుపుతూ నిరసను దిగారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదంటూ పలు జర్నలిస్ట్ సంఘాలు పవన్ వైఖరిని ఖండించాయి.

పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాపరింగ్ చేసినట్టు ప్రాధమిక దర్యాప్తు లో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గత ఐదు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 21 న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టియుడబ్ల్యూజె నేతలు.

Related Articles

Most Populer

Recent Posts