Friday, May 3, 2024
- Advertisement -

పోలీస్ స్టేషన్‌లో డబ్బు మాయం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

- Advertisement -

ఏపిలో సంచలనంరేపిన వీరవాసరం పోలీస్ స్టేషన్‌ డబ్బు మాయం కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో స్టేషన్‌లో పనిచేసే సిబ్బందిని నిందితులుగా తేల్చారు. వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన డబ్బును సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో రూ.8 లక్షలను పోలీస్ స్టేషన్​లో భద్రపరిచారు.

బ్యాంకులు తెరిచిన తర్వాత పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచిన డబ్బు కోసం వైన్ షాపుల సిబ్బంది వెళ్లగా..లాకర్​లో ఉంచిన నగదు కనిపించలేదు.లాకప్‌లో ఉంచిన ట్రంకు పెట్టి సీల్ తొలగించి తాళం పగులకొట్టి నగదు దొంగిలించినట్లు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చోరీకి గురైన నగదులో వీరవాసరం మద్యం దుకాణానికి సంబంధించి రూ.1,50,000, నౌడూరు దుకాణం- రూ.2,16,060, కొణితివాడ దుకాణం- రూ.50,000, రాయకుదురు దుకాణానికి చెందిన రూ.3,88,270 ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.

దీంతో ఈ కేసు సీరియస్ గా తీసుకొని ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్​లో డబ్బు మాయమైన ఘటనపై విచారణ చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ద్వారా వీరిద్దరి గుట్టు బయటపడింది. ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.8,04,330 స్వాధీనం చేసుకున్నారు.

వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !

శృతిహాస‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

రౌడీ హీరో మరో సంచలన నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -