Saturday, May 25, 2024
- Advertisement -

వలస వాదులతో బీజేపీకి నష్టమేనా?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.ఇటు తెలంగాణలో అటు ఏపీలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడమే బీజేపీకి ప్రస్తుత పరిస్థితి కారణమనే అపవాదు ఉంది. ఇది ఇప్పటికే తెలంగాణలో ప్రూవ్ అయింది. ఎన్నికలకు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇతర పార్టీల నుండి నేతలతో ఫుల్ జోష్‌లో ఉంది బీజేపీ. కానీ తీరా ఎన్నికల టైం వచ్చే సరికి వలస నేతలంతా తిరిగి సొంతగూటికి చేరిపోయారు. దీంతో ఒకానొక దశలో అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి తలనొప్పిగా మారింది.

ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నుండి వచ్చిన పురందేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమించారు. అప్పటినుండే ఆమెపై సొంతపార్టీలోనే తిరుగుబాటు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు అధికార పార్టీ నుండి ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా సొంత పార్టీ నేతల విమ్శలను ఆమె తట్టుకోలేకపోతున్నారు.

విమర్శల సంగతి పక్కనపెడితే ఆమెకు మెజార్టీ బీజేపీ నేతలు సహకరించడం లేదు. ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధం లేని వ్య‌క్తిని.. సుదీర్ఘ‌కాలంగా కాంగ్రెస్‌తో ఉన్న పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు సంవత్సరాల క్రితం బీజేపీని పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్న నేతలకే పెద్దపీట. వారే అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇదే ఇప్పుడు బీజేపీ ఉనికి కొల్పోవడానికి కారణమని కొంతమంది నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఏపీ బీజేపీలో అంతో ఇంతో పట్టు ఉన్న విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు స‌హా అనేక మంది నేతలు బయటకు రావడం లేదు. దీంతో సొంతపార్టీ నేతల సహకారం లేక పురందేశ్వరి ఒంటరి పోరాటం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -