Monday, April 29, 2024
- Advertisement -

కులగణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

- Advertisement -

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా నవంబర్ 15 నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో 38 అంశాలపై చర్చించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, దేవాలయాల ఆదాయ పరిమితుల ప్రకారం కొత్త కేటగిరీలుగా విభజనకు ఆమోదం తెలిపింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ళ పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునై ర్యాటిఫై చేసింది.

అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్ 2023కు ఆమోదం తెలిపింది. ఇక అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది. రూ. 19 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. రోడ్లు, భవనాల శాఖలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో 467 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. మార్కాపూర్ మెడికల్ కాలేజీలో కొత్తగా 21 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

వాస్తవానికి అక్టోబరు 31న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నా విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా నవంబరు 3కి వాయిదా పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -