Friday, April 26, 2024
- Advertisement -

నిమ్మరసం, పసుపు కలిపి తాగితే.. లాభాలేంటో తెలుసా?

- Advertisement -

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అత్యంత ప్రధాన‌మైన విష‌యం. అయితే, ఈ విష‌యంలో చాలా మంది వెనుక‌బ‌డి ఉన్నార‌ని ప‌లు సర్వేలు ఇటీవ‌ల పేర్కొన్నాయి. అయితే, కొన్ని వంటింటి చిట్కాల‌తో కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఉండ‌టంతో పాటు శ‌రీరానికి మెలు క‌లుగుతోంద‌ని ప‌లువురు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. వాటిలో నిమ్మ‌ర‌సం, ప‌సులు కాంభినేష‌న్ చేసిన పానీయం తాగితే మంచి ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెబుతున్నారు.

సాధార‌ణంగా నిమ్మ‌కాయాలు, ప‌సుపును మ‌నం నిత్యం తీసుకునే అనేక ఆహార ప‌ద‌ర్థాల‌లో తీసుకుంటాం. ఈ రెండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వేరువేరుగా కాకుండా క‌లిపి తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు అధికంగా ఉంటాయి. రోజు ఒక గ్లాసు గొరువెచ్చ‌ని నీటిలో కొద్దిగి నిమ్మ‌ర‌సం, ప‌సుపు క‌లుపుకుని తాగితే మంచి లాభాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఆ ప్ర‌యోజ‌నాలు: నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఫ‌లితాలు ఇస్తుంది. అలాగే, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది. కీళ్ల నొప్పుతు త‌గ్గుతాయి. చ‌ర్మ సంబంధ వ్యాధులు ద‌రిచేర‌వు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కేంద్రంపై కేటీఆర్ ఫైర్

ల‌క్ష‌లాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మెట్లెక్కిన తెలుగు అకాడమీ అంశం

దూకుడు పెంచిన ప్రియమణి

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -