Friday, May 3, 2024
- Advertisement -

చంద్రబాబు – కేసీఆర్ సేమ్ టూ సేమ్!

- Advertisement -

ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం కొత్తేమీ కాదు అయితే ఈ ప్రయత్నంలో కొన్ని పార్టీలు సక్సెస్ అయినా మరికొన్ని రాజకీయ పార్టీలు మాత్రం విఫలమయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరు మాజీ సీఎంలకు మాత్రం కాలం కలిసిరాలేదు.జాతీయ రాజకీయాలేమో కానీ ఆ ఇద్దరు నేతలు అధికారాన్ని పొగొట్టుకున్నారు. వారే తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ నేత కేసీఆర్. ఏపీ మాజీ సీఎం, టీడీపీ నేత చంద్రబాబు.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు చంద్రబాబు. అయితే అదే చంద్రబాబు కొంప ముంచింది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీకి పరాభవం తప్పలేదు. ఆ తర్వాత కేసులు అంటూ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇదే పరిస్థితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేశారు కేసీఆర్. మహారాష్ట్రలో పలు బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఏపీకి ఓ అధ్యక్షుడిని ప్రకటించారు. ఈలోపే తెలంగాణ ఎన్నికలు రాగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకున్న ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు చంద్రులకు పరాభవం జరగడం మాత్రం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు ఓ గుణపాఠమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -