Tuesday, May 7, 2024
- Advertisement -

బాబు బెయిల్ వాయిదా.. అయోమయంలో టీడీపీ శ్రేణులు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ స్కామ్‌లో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా 15వ తేదికి వాయిదా వేసింది న్యాయస్థానం. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే.

ఇక మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించనుంది న్యాయస్థానం. అలాగే మాజీ మంత్రి నారాయణపై అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా దీనిని విచారించనుంది న్యాయస్థానం.

మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ఈ నెల 28న తిరిగి జైలుకు వెళ్లాల్సిందే. ఇక బయటికి వచ్చాక టీడీపీకి బాబు దిశానిర్దేశం చేస్తారనుకున్నా ఆస్పత్రుల చుట్టే తిరగాల్సి వస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇక నారా భువనేశ్వరి పరామర్శయాత్రను పక్కకు పెట్టారు. ఇక లోకేష్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. బాబు హైదరాబాద్‌లో ఉంటే లోకేష్ ఢిల్లీలో మంత్రాంగం చేస్తున్నారు. ఇక స్కిల్ స్కాం కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు.

అయితే బాబు క్వాష్ పిటిషన్‌ పై నవంబర్ 28 తర్వాత ఉత్తర్వులు ఇస్తామని సుప్రీం కోర్టు చెప్పడంతో ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీ నేతలు అయోమయంలో మునిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -