Thursday, May 2, 2024
- Advertisement -

గాజువాక..గుడివాడదేనా?

- Advertisement -

గాజు వాక..ఏపీలోనే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్‌. 2019లో గాజువాకతో పాటు భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. ఇక ఈసారి పవన్ గాజువాక నుండి పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగగా చివరకు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు పవన్.

అయితే గత ఎన్నికల్లో పవన్‌ను వైసీపీ ఓడించింది. ఈ సారి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఇద్దరూ మాస్ లీడర్లే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రియల్ కారిడార్‌కు కేరాఫ్‌గా ఉన్న గాజువాక స్టీల్ ప్లాంట్‌తో మరింత ప్రసిద్ధి చెందింది. 2009లో గాజువాక నియోజకవర్గం ఏర్పడగా ఏ ఒక్క పార్టీ అభ్యర్థి రెండోసారి గెలిచింది లేదు.

2009లో పీఆర్పీ గెలిస్తే 2014లో టీడీపీ నుండి పల్లా శ్రీనివాస్,2019లో నాగిరెడ్డి గెలిచారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తొలిసారిగా గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచే కార్పొరేటర్‌గా పనిచేసిన అమర్‌నాథ్‌ 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమర్‌నాథ్ ఫ్యామిలీది రాజకీయ నేపథ్యం ఉంది. తాత గుడివాడ అప్పన్న,తండ్రి గుడివాడ గురునాథరావు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. స్థానికంగా పట్టు ఉన్న నాయకుడు కావడంతో అమర్ నాథ్ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుఓంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అందరినీ కలుపుకునిపోయి మరోసారి గాజువాకలో వైసీపీ జెండా ఎగుర వేస్తామని చెబుతున్నారు అమర్‌నాథ్. ఇక టీడీపీ అభ్యర్థి పల్లా కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో గాజువాక ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -