Monday, April 29, 2024
- Advertisement -

హ్యాట్రిక్ కొడతా..జగన్ కు గిఫ్ట్ ఇస్తా!

- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మూడో జాబితా వచ్చేసింది. మూడో జాబితాలో 21 మంది అభ్యర్థులను మార్చగా ఇందులో 6 ఎంపీ స్థానాలున్నాయి. ఇక విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానికి టికెట్ కేటాయించారు జగన్. ఇటీవలె టీడీపీతో విభేదించి నాని బయటకు రాగా పార్టీ కండువా కప్పుకోకుండానే నానిని ఇంఛార్జీగా ప్రకటించారు జగన్.

ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ కేశినేని నాని. తనపై నమ్మకంతో విజయవాడ నుండి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముచ్చటగా మూడోసారి గెలిచిన తన విజయాన్ని జగన్‌కు అంకితమిస్తానని చెప్పారు. విజయవాడ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. బెజవాడలో వైసీపీ జెండా ఎగరేయడమే తనముందున్న లక్ష్యని చెప్పారు నాని.

2014,2019లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు నాని. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన నాని ఆశలపై నీళ్లు చల్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాని తమ్ముడు చిన్నిని ప్రొత్సహిస్తూ కేశినేని కుటుంబంలో చిచ్చు పెట్టారు. దీంతో బయటకు వచ్చిన నాని..సీఎం జగన్‌ను కలిశారు. ఇక జగన్‌ను కలిసిన కొద్దిరోజులకే నానిని ఇంఛార్జీగా నియమించారు. ఇక ఇప్పటివరకు తొలి జాబితాలో 11,రెండో జాబితాలో 27,మూడో జాబితాలో 21 మంది అభ్యర్థులను మార్చారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -