Monday, April 29, 2024
- Advertisement -

పవర్‌స్టార్ కాదు మ్యారేజ్ స్టార్!

- Advertisement -

అగ్రవర్ణాల పేద మహిళలకు సాయం అందించేందుకే ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు సీఎం జగన్. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన జగన్..లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు.

ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడిన జగన్..పేదరికానికి కులం అడ్డుకాకుడదన్నారు. కులం,మతం, ప్రాంత అనేది చూడకుండా అందరికి సాయం చేస్తున్నామన్నారు. అర్హులైన వారందరికి పథకాలు అందజేస్తున్నామన్నారు. 2014లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారనీ.. ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు వస్తున్నారని ఓటు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్‌ ఇస్తామని చెప్తారు..మీ బిడ్డగా నాకు మోసం చేయడం రాదన్నారు.

ఎన్నికల కోడ్ మరో మూడు, నాలుగు రోజుల్లో వస్తుంది. బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేశాం అయితే డబ్బులు జమ కావటానికి కొద్దిగా ఆలస్యం కావచ్చు… ఓ వారం అటో ఇటో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంది, మీ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయని దీనిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఇక పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు జగన్. దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడని… కార్లు మార్చినట్లు భార్యలను మార్చే మ్యారేజీస్టార్ అని సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -