Monday, April 29, 2024
- Advertisement -

ఎంపీగా సోనియా కన్ఫామ్..ప్రకటనే తరువాయి!

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమించగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా తెలంగాణలో మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనున్నాయి. ఇక కాంగ్రెస్ తరపున ఒకటి ఏఐసీసీకి, ఒకటి రాష్ట్ర నేతలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో పోటికి సోనియా విముఖంగా ఉండటంతో రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపియాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇక మరో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, వంశీ చందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఖమ్మం నుండి పోటీ చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయగా అనారోగ్య కారణాలతో సోనియా లోక్ సభకు పోటీ చేయడం లేదు. దీంతో రాష్ట్రం ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత చెప్పుకునేందుకు రాజ్యసభకు పంపించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -