Tuesday, April 30, 2024
- Advertisement -

బాబు క్వాష్ పిటిషన్..మళ్లీ వాయిదా

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తన పేరు కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను మళ్లీ వాయిదా వేసింది న్యాయస్ధానం.

17A చుట్టూ వాదనలు కొనసాగగా 17A వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించగా.. వర్తించదని సీఐడీ తరపున లాయర్లు వాదించారు. చంద్రబాబు తరపున అభిషేక్‌ సింఘ్వి, హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా ఏపీ సీఐడీ తరపున ముకల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

చంద్రబాబుకు 17A వర్తించదని క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని పేర్కొన్నారు. 2018లో సెక్షన్‌ 17A అమల్లోకి వచ్చిందని.. వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. ఈ కేసుకి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ముందున్న డాక్యుమెంట్ల కంపైలేషన్ తమకు అందజేయాలని రోహత్గీకి ఆదేశించింది న్యాయస్ధానం. ఇక ఏపీ హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -