Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీ -జనసేన..పొత్తులపై రచ్చ!

- Advertisement -

పొత్తుల వేళ త్యాగాలు తప్పవని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, సీనియర్లు నో అంటున్నారు. జనసేనకు గౌరవ ప్రదమైన స్థానాలు పొత్తులో తీసుకుంటామని పవన్ చెప్పారు. కానీ, చంద్రబాబు తాను ఇచ్చే సంఖ్య చాలా గౌరవ ప్రదమైనదిగా తేల్చేస్తున్నారు. ఇక, ఇప్పుడు బీజేపీ సీన్ లోకి వస్తోంది. అసలు ఆట మొదలవుతోంది. సీట్ల కోసం ఎవరి పట్టు వారిదే. సీటు కాదంటారా చెప్పండి మా సత్తా చూపిస్తాం అంటూ రెండు పార్టీల సీనియర్లు అల్టిమేటం జారి చేస్తున్నారు. సీట్లు దగ్గరే ఇలా ఉంది. ఒక ఓట్ల బదిలీ ఎలా సాధ్యం. అసలు త్యాగాలు టీడీపీ వాళ్లు చేయటం ఏంటి. జనసేన కూడా చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గళమెత్తారు.

చంద్రబాబు ఏ సీట్లు ఇస్తారో ఇప్పటికే జనసేనకు స్పష్టత ఇచ్చారన్నారు. ఎవరెవరో సీట్లు ఆశిస్తే తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజమండ్రి రూరల్ సీటు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన స్థానం ఈ సారి జనసేన నుంచి కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు. అసలు తనకు సీటు లేకపోవటం ఏంటని బచ్చయ్య ఫైర్ అవుతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. తాను పార్టీ వ్యవస్థాపక సభ్యుడినని గుర్తు చేస్తున్నారు. సిట్టింగ్ సీట్లు జనసేనకు ఇచ్చేదే లేదని స్పష్టం చేసారు. దుర్గేష్ ఏం ఆలోచిస్తారో తనకు అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు. అసలు టీడీపీ వాళ్లు త్యాగాలు చేయటం ఏంటి..జనసేన కూడా త్యాగాలు చేయాలని రివర్స్ అయ్యారు.

ఎవరైనా సీటు ఆశించవచ్చని..దక్కేది మాత్రం ఒక్కరికేనని బుచ్చయ్య చౌదరి వివరించారు. తాను ఆరు సార్లు గెలిచానని..రాజానగరం సీటు జనసేనకు ఇచ్చారంటే రాజమండ్రి రూరల్ ఇవ్వరనేది అర్దం చేసుకోవాలని దుర్గేష్ కు సూచించారు. రాజానగరం నుంచి దుర్గేష్ పోటీ చేయవచ్చని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఈ సీటుకే కాదు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం, మండపేట, పిఠాపురం, ముమ్మిడివరం, రాజోలు, రాజానగరం..ఇలా విజయవాడ, గుంటూరు పశ్చిమం వరకు ఎన్నో నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆశావాహుల మధ్య హోరా హోరీగా మారుతోంది. పిఠాపురంలో వర్మను కాదని జనసేనకు సీటు ఇస్తే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసేందుకు వర్మ సిద్దం అవుతున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇస్తోంది. మూడు పార్టీల నుంచి సీట్ల కోసం కుస్తీ తప్పేలా లేదు. ఈ సమయంలోనే టీడీపీ నుంచి వైసీపీలోకి మళ్లీ జాయినింగ్స్ మొదలయ్యాయి. నూజివీడు టీడీపీ నేత ముద్రబోయిన వైసీపీలో చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -