Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణ..ఏడాదంతా ఎన్నికలే!

- Advertisement -

తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 64 స్థానాలు గెలిచి పీసీసీ చీఫ్ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చింది. అయితే సీఎం ఎంపికపై ఇవాళ క్లారిటీ రానుండగా ఈ సంవత్సరం అంతా ఎన్నికలే జరగనున్నాయి. ఇప్పటికే సింగరేణిలో ఎన్నికల నగారా మోగగా తర్వాత పార్లమెంట్,లోకల్ బాడీ, మున్సిపాలిటీ ఇలా వరుసగా ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో పాటు ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ నుండి ముగ్గురు ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి,కడియం శ్రీహరి,పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీటితో పాటు ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు మొత్తంగా 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇందులో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల స్ధానంతో పాటు మహబూబ్ నగర్ స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంఎల్ఏ కోటాలో రెండు, దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్యేలుగా ప్రతిపాదిస్తు గతంలోనే కేసీయార్ ప్రభుత్వం పంపిన ఫైలు గవర్నర్ దగ్గరే పెండింగులో ఉంది. మొత్తం ఆరు స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు, రెండు బీఆర్ఎస్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఆశావాహులు ఇప్పటినుండి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -