Sunday, April 28, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లోకి షర్మిల..ఏపీకే జై

- Advertisement -

తెలంగాణకు బైబై చెప్పి ఏపీకి జై కొట్టారు షర్మిల. తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు షర్మిల. ఈ నెల 4వ తేదీన 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరున్నట్లు ప్రకటించారు షర్మిల. తనకు ఏపీసీసీ చీఫ్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇచ్చే అవకాశం ఉందని తన అనుచరులకు తెలిపారు షర్మిల.

అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడం కత్తి మీద సామే. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒక్క శాతం కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడిపోయింది.ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే వైఎస్‌ఆర్‌ లెగస్సీ సీఎం జగన్‌ వైపే ఉంది. అందుకే ప్రజలు వైసీపీకి తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు.

వైఎస్‌ వారసురాలిగా షర్మిల వచ్చినా పెద్దగా ప్రజలు ఆదరించే పరిస్థితి ఉండకపోవచ్చు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల పరిస్థితిని గమనిస్తే ఇదే తెలుస్తుంది. కరుణానిధి లెగస్సీ స్టాలిన్‌కు, ములాయం లెగస్సీ అఖిలేష్‌కు ఉపయోగపడింది. సో వైఎస్‌ లెగస్సీ జగన్‌కు తప్ప షర్మిలకు ఉపయోగపడకపోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -