Wednesday, May 8, 2024
- Advertisement -

మెగాస్టార్ భుజానికి సర్జరీ..? ఎందుకు..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి.. 150 పైగా చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాధించుకున్నారు. కేవలం సినిమాలే కాక.. రాజకీయాల్లో కూడా అడుగులు వేశారు. అయితే అభిమానులు మాత్రం ఆయనను మళ్లీ సినిమాల వైపు దారి మళ్లీంచారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందు వచ్చి.. సూపర్ హిట్ కొట్టారు.

అయితే ఆయన తర్వాత తీయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న “సైరా”ని సినిమాని ఇప్పటికే మొదలు పెట్టారు. ఇక అసలు సంగతికి వస్తే.. మెగాస్టార్ గత కొన్ని నెలలుగా ముంబై లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.సంజయ్ ని కలుస్తున్నారట. ఎందుకంటే చిరు ఈ మధ్య బుజం నొప్పితో బాధపడుతున్నారట. దీంతో ఆ ప్రముఖ డాక్టర్ గత కొన్ని వారాలుగా మెగాస్టార్ కి ట్రీట్ మెంట్ చేసి పూర్తిగా కోలుక్నే వరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. డాక్టర్ చెప్పినట్లుగానే చిరు అయన పర్యవేక్షణలో కొన్ని రోజులవరకు ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక హ్యాపీగా షూటింగ్ చేసుకొమ్మని చెప్పారట.

చిరంజీవికి వైద్యం అందించిన డాక్టర్ సంజయ్ ఇంతకుముందు షారుక్ వంటి వారికి కూడా తన వైద్యాన్ని అందించారట. ఇక ఫైనల్ గా చిరంజీవి లాస్ట్ వీక్ లోనే పూర్తిగా కోలుకొని సైరా యుద్ధ పోరాటాల విన్యాసాలను నేర్చుకోనున్నాడు. ఆల్రెడీ తన 151వ సినిమాగా సైరా ను ప్రకటించిన చిరంజీవి.. భుజం నొప్పి తగ్గిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ చేస్తారని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -