సినీ రంగం పెద్దగా వర్మ ఉండాలట.. డైరెక్టర్ ట్వీట్

- Advertisement -

తెలుగు సినీ రంగంలో ఆదిపత్యం కోసం అగ్ర హీరోల మధ్య అంతర్గతంగా చాలాకాలంగా పోరు జరగుతోంది. అనేక సందర్భాల్లో ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకొని రచ్చ కూడా చేసుకున్నారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) ఎన్నికల సందర్భంగా ఈ పోరు మరింత ముదిరింది.

తెలుగు సినీరంగం పెద్దగా మోహన్ బాబు ఉండాలని ‘మా’ మాజీ ప్రెసిడెంట్ నరేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చిరంజీవి బలపరిచిన ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు కూడా. ఈ నేపథ్యంలో నరేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు మరణం తర్వాత ఆలోటు అలాగే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆస్థానాన్ని భర్తీ చేస్తారని చాలా మంది భావించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద అనే హోద నాకు ఒద్దు అని ఇటీవల చిరంజీవి కుండ బద్దలు కొట్టారు.

- Advertisement -

దీంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కుపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా తాజాగా ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘మా బాస్ (రాంగోపాల్ వర్మ) ని తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.. సామి మీరు రావాలి సామీ’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

పది గెటప్స్ లో మాస్ మహారాజ రవితేజ

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -