దిశాకు అన్యాయం.. అల్లు అర్జున్ పై ట్రోల్స్..!

- Advertisement -

వారం రోజులుగా దేశం మొత్తం దిశాకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్నారు. కొందరు సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో కొందరు సెలబ్రిటీలు మాత్రం పట్టనట్లు మౌనంగా ఉంటున్నారు. వారులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.

ఆయన ఇంతవరకు దిశా రేప్ పట్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తాను నటించిన ’అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘సామజవరగమన’ పాటకు వంద మిలియన్ వ్యూస్ వచ్చాయంటూ ట్వీట్ చేశారు. మన రాష్ట్రంలో కాకుండ ఇతర రాష్ట్రాల్లో వరదలు వస్తే వెంటనే స్పందించి అర్ధిక సాయం చేసిన అల్లు అర్జున్.. తెలంగాణలో ఉంటూ తెలంగాణలోని ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే కనీసం స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. ఇదే ప్రశ్న కొందరు నెటిజలు అడుగుతున్నారు.

- Advertisement -

ఈ ఘటనపై స్పందించడం, స్పందించకపోవడం ఆయన ఇష్టం. కానీ ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్న సమయంలో నా సినిమాలోని పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని గొప్పగా ట్వీట్ చేయడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నెటిజన్లు బన్నీపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి ? అల్లు అర్జున్ అని బన్నీని ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...