పవర్ స్టార్ కొత్త సినిమా పేరు ఇదే !

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటు సినిమాలు.. అటు రాజ‌కీయాల్లో బిజీబిజీగా ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. సినిమా ఎలావుంద‌నే దానిని సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద కాలుల వ‌ర్షం కురిపిస్తాయి.

అందుకే హిట్లు, ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్ తో సినిమాలు తీయడానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇటీవ‌లే ‘వ‌కీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన ప‌వ‌న్ తాజాగా ఓ కొత్త ప్రాజెక్టుకు ఒకే చెప్పాడు. ఇదివ‌ర‌కు ‘గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమాకు క‌లిసి ప‌నిచేసిన ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తో ఓ సినిమా చేయ‌డానికి ప‌వ‌ర్ స్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా స్టోరీ ప్ర‌కార ‘సంచారీ’ అనే టైటిల్ హ‌రీష్ శంక‌ర్ ఒకే చేసిన‌ట్టు స‌మాచారం.

- Advertisement -

ప‌వ‌న్ సైతం క‌థ బాగుంద‌నీ, సంచారీ టైటిల్ సైతం త‌న‌కు న‌చ్చింద‌ని హ‌రీశ్ శంక‌ర్ తో అన్నార‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీనిని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది. ప‌వ‌న్‌-హ‌రీష్ శంక‌ర్ కాంభినేష‌న్‌లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ రికార్డుల మోత మోగించిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ధ‌రి కాంభోలో మ‌రో సినిమా వ‌స్తుంద‌న్న నేప‌థ్యంలో అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. అయితే, క్రిష్ తో సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశముంది.

రెండు డోసులు తీసుకున్న 40 డాక్ట‌ర్ల‌కు క‌రోనా

మారుతి డైరెక్ష‌న్‌లో రవితేజ మూవీ !

ఈ ‘పుడింగి నెంబర్ 1’ ఆ ఇద్ద‌రితో ఏం చేస్తాడో మ‌రి !

జింద‌గీ కొత్తగా న‌వ్వుతోందంటున్న’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -