Friday, May 3, 2024
- Advertisement -

అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి స్టైల్‌లో ఉండబోయే ఆర్ఆర్ఆర్ కథ ఇదే

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కోసం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ అనుకున్నాడు రాజమౌళి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్……అది కూడా బాక్సింగ్ నేపథ్యంలో అంటే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది రాజమౌళి ఆలోచన. అది కూడా గ్రాఫిక్స్‌కి అంతగా ప్రాధాన్యం ఉండదు. అయితే కథా విస్తరణలో మాత్రం రాజమౌళి ఊహల మేరకు ఆ బాక్సింగ్ కథ రాలేదట. దాంతో ఆ కథను పక్కనపెట్టేశారు.

ఇక ఆ తర్వాత పసివాడి ప్రాణం సినిమాను భజరంగీ భైజాన్ చేసిన విజయేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో అమీర్ ఖాన్ నటించిన రంగ్ దే బసంతి సినిమా కథను కాస్త అటూ ఇటూగా మార్చి సరికొత్తగా తయారు చేశాడట విజయేంద్రప్రసాద్. అయితే ఎక్కడా కూడా రంగ్ దే బసంతి ఫ్లేవర్ కనిపించకుండా కథనం రాసుకున్నారట. భజరంగీ భైజాన్‌లో కూడా ఎక్కడా పసివాడి ప్రాణం గుర్తుకురాకుండా జాగ్రత్తపడినట్టుగా ఇప్పుడు ఎన్టీఆర్-చరణ్‌ల సినిమా కథను కూడా స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలోనే రంగ్ దే బసంతి సినిమా గుర్తుకు రాకుండా ఉండేలా రాశాడట. స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రస్తుత కాలంలో, స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ సినిమాల స్టార్ హీరోయిన్‌ని కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు రాజమౌళి. ఆ రకంగా ఈ సినిమాకు ఇంటర్నేషనల్ కలర్ ఇవ్వనున్నాడు. ఇక దేశ భక్తి అంశంతో స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో అంటే మరోసారి భారతదేశ సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకునే విషయంలో రాజమౌళి సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -