తన సినిమాని విమర్శించినా కూడా థమన్ కి ఛాన్స్ ఇచ్చిన మహేష్..!

- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతి బరిలో మహేష్ ’సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ’అల వైకుంఠపురములో’ సినిమాలు పోటీ పడ్డాయి. అయితే కలెక్షన్స్ పరంగా అల వైకుంఠపురం ముందులో నిలిచింది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రమంలో ’అల వైకుంఠపురములో’ సినిమా సక్సెస్ మీట్ లో ’సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్స్ ఫేక్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. థమన్ పై మహేష్ అభిమానులు విరుచుకుపడ్డారు.

సోషల్ మీడియాలో ఏకిపారేశారు. ఈ విషయంలో మహేష్ బాబు చాలా సీరియస్ గా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ తన సినిమాకి మళ్లీ చాన్స్ ఇస్తారని అనుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మహేష్ బాబు-పరుశురాం తాజా చిత్రం ‘సర్కార్ వారి పాట’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది నిజంగా ఎవరూ ఊహించనది. పరుశురాంతో ఇది వరకు గీతాగోవిందం సినిమాకు చేసిన గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా అనుకుంటే.. థమన్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం విశేషం. ప్రస్తుతం థమన్ పీక్స్ లో ఉన్నాడు. అల వైకుంఠపురం సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

- Advertisement -

దాంతో థమన్ కు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అందుకే తన సినిమాపై విమర్శలు చేసినా కూడా థమన్ కు ఆఫర్ ఇచ్చాడట మహేష్. ఫిల్మ్ ఇండస్ట్రీలో కోపతాపాలు లేవని.. కంటెంట్ ఉన్నోడికే అగ్రతాంబూలం అని మరోసారి రుజువైంది. దాంతో మహేష్ ఫ్యాన్స్ థమన్ ను యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తున్నారు. కొందరు ఇది మహేష్ మంచితనం అంటే.. మరికొందరు ఇది మాకు నచ్చడం లేదంటున్నారు. మరి ఈ సినిమాకు మంచి సంగీతం ఇస్తే మహేష్ ఫ్యాన్స్ గతంలో థమన్ చేసిన కామెంట్స్ మర్చిపోతారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -