Friday, March 29, 2024
- Advertisement -

ఏపీలో కొత్తగా 5వేల మందికి కరోనా

- Advertisement -

దేశంలో ర‌కోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,086 కేసులు న‌మోద‌య్యాయ‌ని తాజాగా ప్ర‌భుత్వం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,741 పరీక్షలు నిర్వహించామ‌ని క‌రోనా బులిటెన్‌లో పేర్కొంది. ఇందులో 5,086 పాజిటివ్ కేసులుగా నిర్థార‌ణ అయ్యాయ‌ని తెలిపింది. తాజాగా న‌మోదైన కొత్త కేసుల‌తో క‌లిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 9,42,135 మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, రాష్ట్రంలో మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 7,353 మంది వైర‌స్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. తాజా‌గా రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల్లో అధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మ‌ర‌ణించ‌గా.. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వైర‌స్‌తో ప్రాణాలు కోల్పోయారు. చెందారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నాయి.

క‌రోనాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి మృతి..

ఇస్రో సైంటిస్టు అరెస్టు.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశం

కాకతీయగడ్డపై రుద్రమ తర్వాత మళ్లీ షర్మిలే.. !

టీకా తీసుకన్న సర్పంచ్ మృతి

కీర‌దోస‌.. బరువు త‌గ్గించే సులువైన మార్గం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -