Sunday, April 28, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు షాక్‌…స‌మావేశానికి డుమ్మాకొట్టిన‌ 12 మంది ఎమ్మెల్యేలు

- Advertisement -

క‌ర్నాట‌క‌లో క్యాంపు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఏపార్టీకీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజాపా, కాంగ్రెస్-జేడీఎస్ కూట‌మి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. సెకెండ్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవ‌త‌రించినా జేడీఎస్‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చింది.

స్ప‌ష్ట‌మైన మెజారిటీ లేకున్నా భాజాపా కూడా ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకోసం ఆప‌రేష్‌న్ మొద‌లు పెట్టింది. జేడీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతున్న కాంగ్రెస్‌‌కు బుధవారం ఊహించని షాక్ తగలింది.

కాంగ్రెస్ పార్టీ… బెంగళూరులో తమ ఎమ్మల్యేలతో సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ నుంచి మొత్తం 78 మంది గెలుపొందగా, ఈ సమావేశానికి కేవలం 66 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 12 మంది ఎందుకు హాజరు కాలేదనే అంశంపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ 12 మందిలో నలుగురు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఈ పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు… ప్రస్తుతం వీరిని వెతికే పనిలో బీజీగా ఉన్నారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు 8 సీట్ల దూరంలో ఉన్నా… ప్రభుత్వం తమదే అనే ఆత్మవిశ్వాసంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఇదే మాటను యెడ్యూరప్ప కూడా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో, కొందరు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు కూడా జరిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -