Saturday, April 27, 2024
- Advertisement -

గోవా మెడిక‌ల్ కాలేజీ ఆసుప‌త్రిలో దారుణం.. 4 రోజుల్లో 74 మంది మృతి

- Advertisement -

గోవా మెడిక‌ల్ కాలేజీ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ కొర‌త‌తో శుక్ర‌వారం మ‌రో 13 మంది క‌రోనా రోగులు మ‌ర‌ణించారు. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 74 మంది రోగులు కొవిడం ఆసుప్రతుల్లో మరణించారు. వీరంతా ఆక్సిజన్‌ అందక చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం కూడా మరో 13 మంది కరోనా పేషెంట్లు మృతి చెందినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేశాయ్ తెలిపారు.

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులకు సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో అవసరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్నప్పటికీ సరఫరాకు సంబంధించి అంతరాయం కలుగుతుండటంతో అత్యవసర చికిత్స కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులు అవస్థలు పడుతున్నారు.

గోవాలోనే పెద్దాసుపత్రి అయిన గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఈ ఘోరాలు జరగడంతో విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, మంగళవారం రోజున 26 మంది, బుధవారం రోజున 20 మంది, గురువారం తెల్లవారు జామున 15 మంది, ఈరోజు ఉదయం 13 మంది మరణించారు. దీంతో గోవా వైద్య కళాశాల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలో నువ్వే సంపన్నురాలివి తల్లి అంటున్న సోనూసూద్..!

అస్సాంలో ఘోర విషాదం.. 18 ఏనుగులు మృతి!

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -