Monday, May 6, 2024
- Advertisement -

అభినంద‌న్ ఎదుర్కోబోయే ప‌రీక్ష‌లివే

- Advertisement -

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ విక్ర‌మ్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ ఇండియాకు తిరిగి వ‌చ్చేశారు. ఆయ‌న రాక‌కోసం యావ‌త్ దేశ‌మంతా ఎదురుచూసింది. ఆ యోధుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటూ ప్రార్థ‌న‌లు చేశారు భార‌తీయులు. ఆ దేవుడే క‌రుణించాడో.. లేక కేంద్ర ప్ర‌భుత్వం మంత్రాగ ఫ‌లిత‌మో తెలియ‌దు కానీ.. మొత్తానికి ఆయ‌న తిరిగి క్షేమంగా చేరుకున్నారు. వారి కుటుంబం ఎంత‌గానో ఆనందించింది.

ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. మ‌రి ఆయ‌న తిరిగి విధుల్లోకి ఎప్పుడు చేరుతారు? ఇంతకీ ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్లనున్నారు? అనే ప్ర‌శ్న‌లు ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతున్నాయి. తన ధైర్య సాహసాలతో భారతీయుల గుండెల్ని దోచేసిన అభినందన్ కు ఉద్యోగం తిరిగి ఇవ్వటం తర్వాత.. ఆయన ఇంటికి వెళ్లటానికి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే.. శత్రు దేశంలో కొంతకాలం ఉండి వచ్చిన ఆయనకు చాలానే పరీక్షలు ఉంటాయి. వాటిని ఆయన విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే ఏమైనా.

భారత్ కు చేరిన అభినందన్ ను నేరుగా భారత వాయుసేన అంటెలిజెన్స్ యూనిట్ కు అప్పగిస్తారు. వారు అభినందన్ శారీరకంగా ఎంత ఫిట్ నెస్ తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు జరుపుతారు. శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు ఏమైనా ఉంచారా? అన్న విషయాలపై దృష్టి సారిస్తారు.

ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాల్ని తెలుసుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధిస్తారు. పెదవి విప్పకుంటే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని ఎదుర్కొని మరీ నోరు విప్పని పరిస్థితి కొందరిలో ఉంటుంది. అభినందన్ విషయంలో అదెంత వరకు? అన్నది గమనిస్తారు.

అనంతరం ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రీసెర్చ్.. రా (అనాలసిస్ వింగ్) అధికారులు కూడా అభినందన్ ను క్షుణ్ణంగా విచారిస్తారు. సాధారణంగా యుద్ధ ఖైదీలకు అయితే ఈ రెండు సంస్థల విచారణ అవసరం లేదని.. కానీ అభినందన్ ను యుద్ధ ఖైదీగా పరిగణించాలో లేదో అన్న సందేహం ఉండటంతో ఈ రెండు సంస్థలకు చెందిన అధికారులు కూడా ప్రశ్నలు సంధించే వీలుంది.

ఇలా ఇన్ని దశలు దాటిన తర్వాత.. ఆయన్ను ఇంటికి పంపుతారు. పాక్ సైన్యానికి బంధీగా ఉన్న వేళలో ఆయన ప్రదర్శించిన ధీరత్వం.. వారు అడిగిన ప్రశ్నలకు హుందాగా చెప్పిన సమాధానాలతో ఆయన దేశ భక్తిని శంకించే పరిస్థితి లేకున్నా.. చిన్న వీడియో క్లిప్ తో ఒక అంచ‌నాకి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఆయన 60 గంటల పాటు పాక్ చెరలో ఉన్నారు.

ఆ 60 గంట‌ల్లో ఏం జ‌రిగింది? వారేం అడిగారు.. అభినందన్ ఏం చెప్పారన్న విషయాల్ని క్షుణ్ణంగా మన అధికారులు రాబడతారు. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే అభినందన్ ను ఇంటికి పంపుతారు.

ఈ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న గౌర‌వానికి, మ‌ర్యాద‌కు ఎక్క‌డా భంగం క‌ల‌గ‌కుండా ఈ ప్ర‌క్రియ ముగుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -