Thursday, May 2, 2024
- Advertisement -

దేశంలోని స‌గం జిల్లాల్లో ఉన్న భూగ‌ర్భ‌జ‌లాలు విష‌పూరితం…

- Advertisement -

అనేక ఏళ్లుగా పరిశ్రమలు నుంచి వచ్చే వ్యర్థాలు, విషతుల్యాలు, పురుగు మందుల అవశేషాలలో భూమిలో చేరి భూగర్భ జలాలు కలుషితమైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. దేశంలోని 50 శాతం కంటే ఎక్కువ జిల్లాల్లో భూగర్భ జలాలు విషపూరితంగా మారి పరిమితికి మించి నైట్రేట్లు కలిగి ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. జిల్లాల్లో నీటిలో నైట్రేట్స్, లెడ్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, కాడ్మియం, ఇతర భార లోహాలు ఉన్నాయని వెల్లడించింది.

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 386 జిల్లాల్లో(ప్రస్తుతం దేశంలో 718 జిల్లాలు ఉన్నాయి) ని భూగర్భ జలాల్లో హానికారక రసాయనాలు సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఏడింటిలో ఫ్లోరైడ్ కాలుష్యం తీవ్రంగా ఉంది. అలాగే దేశంలోని 335 జిల్లాల్లో ఫోర్లైడ్, 153 జిల్లాల్లో ఆర్సెనిక్, 24 జిల్లాల్లో కాడ్మియం వంటి రసాయనాలున్న నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం… తాగునీటిలో నైట్రేట్ శాతం అధికంగా ఉంటే మెథెమోగ్లోబినియామియా లేదా శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా అందజేసే సామర్థ్యాన్ని రక్తం కోల్పోతుంది. దేశంలోని 50 శాతం కంటే ఎక్కువ జిల్లాల్లో భూగర్భ జలాలు తాగడానికి అనుకూలంగా లేవని నివేదిక తేటతెల్లం చేసింది.

దేశంలోని అత్యధిక భాగంలోని భూగర్భజలాలు తాగడానికి పనికిరావని.. ఒకటి కంటే ఎక్కువ విష రసాయనాలు అందులో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. పలు రాష్ట్రాల్లోని భూగర్భజలాల్లో లవణీయత, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్లు, భార లోహాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కి మించి ఉన్నట్టు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ పార్లమెంటులో ప్రకటించారు.

ఆర్సెనిక్ పరిమాణం ఎక్కువగా ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే అనేక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, చర్మ, మూత్రాశయ కేన్సర్లు, కిడ్నీ, ఊరితిత్తులు, కాళ్లు, పాదాల్లోని రక్త నాళాల సమస్యలు, డయాబెటిస్, అధిక రక్తపోటు, పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటాయి. ఇదే విధంగా రసాయనాలు సాధారణ స్థాయికి మించి ఉంటే మనుషులతోపాటు జంతువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో అన్నిరకాలైన విషపూరిత రసాయనాలు, భార లోహాలు ఉన్నాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -