Friday, April 19, 2024
- Advertisement -

వాట్సప్‌ వాడే వారి డేటా మొత్తం లీక్..?

- Advertisement -

టెక్నాల‌జీ పెరిగిన కొద్దీ జాగ్ర‌త్త‌లూ మ‌రింత పెర‌గాలి. మ‌న గురించి మ‌న‌కంటే ఇంట‌ర్నెట్‌కే ఎక్కువ తెలుస్తున్న రోజుల్లో బ‌తుకుతున్నాం కాబ‌ట్టి ఏమ‌రుపాటుగా ఉండ‌కూడ‌దు.  వాట్సప్‌ వినియోగదారుల సమాచారం సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదముందని దేశ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఈఆర్​టీ) హెచ్చరించింది.

వాట్సాప్‌, వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లలో వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని పక్కదారి పట్టించే సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు సీఈఆర్​టీ వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సైబర్‌ ముప్పునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.

వాట్సాప్‌ v2.21.4.18, వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ v2.21.32 వర్షన్‌లలో ఈ లోపాన్ని గుర్తించినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్​లో ఉన్న వాట్సాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సీఈఆర్​టీ సూచించింది.

బండి సంజయ్ పై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు

సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ..మంత్రి ఇల్లు అక్కడే ఉంది..!

ఆ ఊరి వాళ్ళు ఓటు వెయ్యరంట.. ఎందుకంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -