Sunday, April 28, 2024
- Advertisement -

వరదబాదితులకోసం అనంతపురం ఎమ్మెల్యే ఏంచేశాడంటే…?

- Advertisement -

ఈ సారి వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కరవు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో వర్షాలు పడటంతో భారీగా వరదలు వచ్చాయి.తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన వరదల ధాటికి యాడికి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 700 కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు రూ.8 కోట్లు నష్టం వాట్టిల్లింది. బాధితులను ఆదుకోవడంకోసం వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కలిసి భిక్షాటనకు దిగారు.

ఎమ్మెల్యే భిక్షాటనకు పలువురు మనసున్న మారాజులు స్పందించారు. కాకతీయ కమ్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రంగనాథ్ రూ.5.72 లక్షలు, సాగర్ సిమ్మెంట్స్ రూ.5లక్షలు, పెన్నా సిమ్మెంట్స్ రూ.5 లక్షలు, వాల్మీక.డిపత్రి ఇండియన్ మెడికల్ అసోషియేషన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. వారితో పాటు పలువురు వ్యాపారులు,వైసీపీ కార్యకర్తలు కూడా తమవంతు వరదబాధితులకోసం తమవంతు సహాయం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -