Tuesday, April 23, 2024
- Advertisement -

రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పొడిగింపు

- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకలు, సభలు, ర్యాలీల వంటి వాటిపై నిషేధం విధించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగిస్తూ జీవో జారీ చేసింది.

ఈ నెల 25 నుంచి 10 వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయ, మతపరమైన, సాంస్క్రుతిక కార్యక్రమాలను నిషేధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది.

షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా సంస్థలు, వ్యాపార సముదాల యాజమానులకు సైతం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. విధిగా శానిటైజేషన్ ను చేయాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చూడాలని ఆదేశించింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో లక్షా ఆరవై వేల కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనూ రోజువారీ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -