Friday, March 29, 2024
- Advertisement -

తమిళనాట మరో పెను ముప్పు..!

- Advertisement -

నివర్‌ తుపాను‌ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. తర్వాత తుపానుగా మారే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ తుపాను బుధవారం శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటవచ్చని అంచనా వేసింది. ఈ తుఫాన్​‌ ప్రభావంతో తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఈ మేరకు దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ సందర్భంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఇవాళ్టి నుంచి జాలర్లు బంగాళాఖాతంలోని ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లినవారు తీరానికి తిరిగి రావాలని కోరారు.

Also Read

ఉపాధ్యక్షురాలికి 14 ఏళ్ల బాలుడు ఇచ్చిన గిఫ్ట్..!

ఆ కోర్టులో కూడా ట్రంప్ కి ఎదురుదెబ్బ..!

నిర్లక్ష్యం పై మోదీ క్లాస్..!

ఢిల్లీలో వాక్సిన్ పంపిణీ.. ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -