Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీ లో మరో అంతు చిక్కని వ్యాధి..21 మంది హఠాత్తుగా..!

- Advertisement -

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి వింతవ్యాధి కలకలం రేగింది. ఏలూరు, పూళ్ల ఘటనలు మరువకముందే తాజాగా దెందులూరు మండం కొమరేపల్లిలో వింతవ్యాధి బయటపడింది. 21మంది అస్వస్థతకు గురుయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఈ వింత వ్యాధికి కారణాలేంటో అన్వేషించే పనిలో పడ్డారు.మొన్న ఏలూరు.. నిన్న పూళ్ల… నేడు కొమిరేపల్లి.. వింత వ్యాధి మాత్రం పశ్చిమగోదావరి జిల్లా వాసులను వదిలిపెట్టడం లేదు. దెందులూరు మండలం కొండపల్లి గ్రామంలో అంతుచిక్కని కారణాలతో 21 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.

గురువారం రాత్రి నుంచి కొందరు మూర్ఛ వచ్చి….మరికొందరు కళ్లు తిరిగి పడిపోతున్నారు. కారణాలు ఏంటో అర్థంకాక జనం ఆందోళన చెందుతున్నారు. వింతవ్యాధి విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి , కలెక్టర్ ముత్యాలరాజు, డీఎంహెచ్‌వో సునంద ఇతర ఉన్నతాధికారులు కొమిరేపల్లికి తరలివచ్చారు. బాధితులను 108 వాహనాల్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, గుండుగొలనులోని ఆసుపత్రికి తరలించారు. స్థానికంగానూ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

బాధితులను అక్కడికి తరలించి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు .అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేయడం ప్రారంభించారు. బాధితలు అస్వస్థతకు గురికావడానికి కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో శంకర్‌ హిస్టారికల్ వార్ డ్రామా!

అడిగితే బాలయ్యకు ఆ పదవి ఇవ్వొచ్చు.. మంత్రి కొడాలి

ఆ రాముడు మనకెందుకు? ఒక్క పైసా ఇవ్వొద్దు..

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -