Tuesday, April 30, 2024
- Advertisement -

18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం

- Advertisement -

ఇటీవల కేంద్రం మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 18 నుంచి 45 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాల‌ని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ డోసులను పంపించాలని భారత్‌ బయోటెక్, హెటిరో డ్రగ్స్‌ ఎండీలను సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. భారత్‌ బయోటెక్, హెటిరో డ్రగ్స్‌ ఎండీలతో సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు పంపించాలని కోరారు. అదే విధంగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను సరఫరా చేయాలన్నారు.

ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు సుమారు 2 కోట్ల 4 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాల‌ని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని మే 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు.

మరోసారి తన మంచి మనసును చాటుకున్న సోనూ సూద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -