Saturday, April 20, 2024
- Advertisement -

ప్రారంభ‌మ‌యిన ఏపీ కేబినేట్ తొలి స‌మావేశం….

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమయ్యింది. ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని సమావేశ మందిరంలో భేటీ మొదలయ్యింది. ఈ స‌మావేశంలో 8 కీల‌క అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోబోతున్నట్లు స‌మాచారం.ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి పలు హామీల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం నేపథ్యంలో తొలి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రమాణ స్వీకారోత్సవం రోజు వృద్ధుల పింఛన్‌ మొత్తాన్ని రూ.2250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. సీఎం తన చాంబర్లోకి ప్రవేశించినప్పుడు ఆశ వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో సంతకం చేశారు. అక్టోబరు 15 నుంచి ఏడాదికి రూ.12,500లు రైతుకు సాయంగా అందించే ‘రైతు భరోసా’ పథకానికి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

APSRTCని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం, మున్సిపల్ శానిటరీ వర్కర్ల వేతనాలు పెంపు, ఉద్యోగులకు 27 శాతం IR, రైతు బంధు పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుపై కేబినెట్‌లో చర్చించి… ఆమోదించబోతున్నారు . ఈ హామీల‌న్ని జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ఇచ్చిన‌వి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -