Thursday, May 9, 2024
- Advertisement -

నమ్మినోళ్ల కోసం జగన్ సంచలన నిర్ణయం

- Advertisement -

పదేళ్ల ప్రతిపక్షం.. ఒకటి కాదు రెండు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర.. అధికార టీడీపీ కుట్రలు, కుతంత్రాలు తట్టుకొని జగన్ సహా వైసీపీ నేతలు నిలబడ్డారు.. కలబడ్డారు. పదేళ్ల తర్వాత వచ్చిన అధికారం.. అందుకే జగన్ ఆ ఆనందాన్ని అందరికీ పంచడానికి రెడీ అయ్యారు. తనతోపాటు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అందలమెక్కించాలని నిర్ణయించారు. నామినేటెడ్ సహా మంత్రి పదవుల ద్వారా వారిని భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు..

అయితే ఇక్కడే తిరకాసు మొదలైంది. కీలక నామినేటెడ్ పదవుల్లో తిష్టవేసిన టీడీపీ నేతలు తాము రాజీనామా చేయమంటున్నారు. అత్యున్నత టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ తాను రాజీనామా చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. ఇక రాష్ట్రవ్యాప్తంగా టీటీడీతోపాటు మిగిలిన దేవాలయాలు, కార్పొరేషన్ల పదవులున్నాయి. కానీ టీడీపీ నేతలు తిష్టవేశారు. ఆ పాలకమండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని తాజాగా సీఎం జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే చట్టప్రకారం పాలకమండలి చైర్మన్ ను లేదా సభ్యులను తొలగించాలంటే ముందుగా వారికి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి. ఇక నోటీసులు అందుకున్న వారు కోర్టుకు వెళితే కష్టమే..

అందుకే పాలకమండళ్ల రద్దుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకే ఒక ఆర్డినెన్స్ ద్వారా పాలకమండళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం యోచిస్తోంది. 1987 ఎండోమెంట్స్ చట్టం ప్రకారం కొన్ని సవరణలు ప్రతిపాదించి పాలకమండళ్లను రద్దు చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఇలా కొత్తగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం కోసం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నిర్ణయం వైసీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -