Wednesday, May 1, 2024
- Advertisement -

బాలయ్యకు చెక్ పెట్టే విధంగా జ‌గ‌న్ నిర్ణ‌యం….

- Advertisement -

వైసీపీ సునీమీలో అనంత‌పురం జిల్లా హిందూపూర్ నియోజికవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు . రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా… బాలయ్య ఇలాకాలో మాత్రం సైకిల్‌కు ఎదురులేకపోయింది. అయితే భ‌విష్య‌త్తులో బాల‌య్య‌కు చెక్ పెట్టే విధంగా జ‌గ‌న్ ముందుకు క‌దులుతున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాన్ని జిల్లాగా మారుస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ఆ దిశ‌గా కార్య‌చ‌ర‌ణ‌ను ప్రారంభించారు. ఇప్ప‌టికే కొత్త జిల్లాల మీద అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. బాల‌య్య నియోజ‌క వ‌ర్గానికి ఎర్త్ పెట్టేంందు జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు.

అనంతపురం జిల్లా నుంచి హిందూపురం నియోజికవర్గాన్ని విడదీసి… కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ఇదే గనుక జరిగితే బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచే అవకాశం ఉంది. హిందూపురం పార్లమెంట్ నియోజికవర్గం పరిధిలో మూడు రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు ఉన్నాయి. మ‌రో వైపుబెంగులూరు ద‌గ్గ‌ర‌గా ఉండంతో కొత్త జిల్లాగా చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్… హిందూపురం నుంచే ప్రాతినిధ్యం వహించి… రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తండ్రి పోటీచేసిన స్థానం మీద ప్రేమతోనే బాలయ్య ఇక్కడి నుంచి బరిలో దిగారు… రెండుసార్లు విజయం సాధించారు. ఇటీ వ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోరెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా మారిస్తే నియోజికవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అదే గనుక జరిగితే హిందూపురం నియోజికవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం గ్యారెంటీ. ఇదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో భ‌యాన్ని రేకెత్తిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -