Saturday, April 27, 2024
- Advertisement -

ప్రధాని భద్రత వైఫల్యం తీవ్రమైన అంశం : సుప్రీం

- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతాలోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, రికార్డులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. భద్రతా వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

జస్టిస్ ఎన్వీ రమణ నేత్రుత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, పంజాబ్ అడ్వకేట్ జనరల్, పిటిషనర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, పంజాబ్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతోందని త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వారు సుప్రీం కోర్టుకు తెలిపారు. కాగా సుప్రీం ఆధ్వర్యంలోనే విచారణ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ప్రధాని పంజాబ్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గంలో వెలుతుండగా రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు పైనే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘోర భద్రత వైఫల్యంపై కేంద్ర కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం కూడా కమిటీని వేసింది.

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

ఎన్నికలని ఆపలేని ఒమిక్రాన్‌

స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ కావాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -