Tuesday, May 7, 2024
- Advertisement -

నెక్ట్స్ బ్రాహ్మణినేనా?

- Advertisement -

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ వైపు చంద్రబాబు రిమాండ్ మరోవైపు చినబాబు లోకేష్ త్వరలో అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ పగ్గాలను చేపట్టేందుకు నారా బ్రాహ్మణి సిద్ధమవుతోండగా తాజాగా పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బ్రాహ్మణి అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ6గా హెరిటేజ్ ప్రాపర్టీస్‌ని చేర్చింది ఏపీ సీఐడీ. ఈ సంస్థలో కీలకంగా ఉన్నారు భువనేశ్వరి, బ్రాహ్మణి. దీంతో వీరి ప్రమేయం కూడా ఉన్నట్లు కోర్టుకు నివేదించడానికి సీఐడీ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానకారణం ఇన్నర్‌రింగ్‌రోడ్ ఎలైన్‌మెంట్ మార్పిడి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన దాదాపు 14 ఎకరాల భూమి విలువను పెంచే ప్రయత్నం చేశారన్నది సీఐడీ అధికారుల విచారణలో తేలింది.

ఈ రకంగా బ్రాహ్మణితో పాటు భువనేశ్వరిని కూడా కట్టడి చేయొచ్చనేది వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్‌మీద నమోదైన కేసుల తరహానే ఈ కేసు కూడా.. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులకు.. సంస్థలకు ప్రయోజనం చేకూర్చి.. వారి ద్వారా తన కంపెనీలకు ఆయాచిత ప్రయోజనం చేకూర్చారన్నది జగన్‌ మీద పదేళ్ల క్రితం నమోదైన కేసుల సారాంశం. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది ఏపీ సర్కార్. దీంతో చంద్రబాబుకు వేసిన ప్రతీ ఎత్తుగడకు కౌంటర్ ఇచ్చేలా వైసీపీ సర్కార్ ప్రతీ వ్యూహాలను సిద్ధం చేస్తోందని పొలిటికల్ ఎనలిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -