Friday, April 19, 2024
- Advertisement -

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు

- Advertisement -

ఇవాళ సాయంత్రం 5 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ పరీక్షల నిర్వహణ కూడా కష్టం కావడంతో గత ఏడాది పాఠశాల, కళాశాల స్థాయిలో అందరు విద్యార్థులను పాస్ చేశారు. పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు.

ఈ ఏడాది అయినా పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చాలా రోజుల వరకు వేచి చూసింది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఎంతకూ కరోనా తగ్గకపోవడంతో చివరికి అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇవాళ సాయంత్రం విజయవాడ లోని ఆర్అండ్ బీ భవనంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.

2020 మార్చి నుంచి 2021 జూన్ వరకు విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ‘www.bse.ap.gov.in‘ తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్ సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆయా పాఠశాల హెచ్ఎం లు విద్యార్థుల మెమోరాండమ్ ఆఫ్ సబ్జెక్టు వైస్ పెర్ఫార్మెన్స్ లను తమ పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డైరెక్టర్ సుబ్బారెడ్డి సూచించారు.

Also Read: ఎమర్జెన్సీకి ఒకే నంబర్​.. అతి త్వరలో అమల్లోకి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -