Tuesday, May 7, 2024
- Advertisement -

వ‌రుస‌గా ఐదు రోజులు నిలిచిపోనున్న‌ బ్యాంకింగ్ సేవ‌లు..

- Advertisement -

దేశ వ్యాప్తంగా వ‌రుస‌గా ఐదురోజులు బ్యాంకింగ్ సేవ‌లు నిలిచిపోనున్నాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఈ నెల 21న(శుక్రవారం) బ్యాంకు అధికారులు ఒక రోజు సమ్మె చేయనున్నారు.

డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. 24వ తేదీ (సోమవారం) బ్యాంకులు తెరుస్తారు. 25వ తేదీ క్రిస్మస్‌ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ సమ్మెకు దిగుతోంది.ఈ లెక్కన 24వ తేదీ మినహాయిస్తే డిసెంబరు 21 (శుక్రవారం) నుంచి 26 (బుధవారం) వరకు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి.

అన్ని స్థాయిల్లోనూ వేతన సవరణతోపాలు పలు డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటి వరకు వేతన సవరణల్లో అన్ని తరగతుల అధికారులకు ఒకే విధమైన సవరణ ఉండేదని, 11వ వేతన సవరణలో అధికారుల పనితీరును బట్టి కాకుండా, బ్యాంకుల పనితీరును బట్టి సవరణ చేయాలన్న యాజమాన్యాల మొండి వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -